Singer | Sagar & Sumangali |
Composer | Devi Sri Prasad |
Music Lable | Aditya Music |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Lyrics
Edo Priyaragam Song Lyrics In Telugu
ఏదో ప్రియరాగం వింటున్నా… చిరునవ్వుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా…
ఏదో నవనాట్యం చూస్తున్నా… సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా…
ఇట్టాగే కలకాలం… చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం… కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా… చిరకాలం నావెంటే
నువ్వుంటే నిజమేగా స్వప్నం… నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా… ఏదో తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం… నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా… ఏదో సంతోషం
ఓ… పాట పాడదా మౌనం… పురివిప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చెయ్యదా… ప్రేమ బాటలో పయనం
దారి చూపదా శూన్యం… అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా… వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం… నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిత్యం… నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా… గుండెల్లో కలకాలం
నువ్వుంటే ప్రతి ఆశ సొంతం… నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఎండైనా కాదా… చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతిమాట వేదం… నువ్వుంటే ప్రతి పలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే… నిండెను ఈ లోకం
ఓ… ఉన్నచోట ఉన్నానా… ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం… నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా… ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనందసాగరం… నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే… ఈ రంగులు నీవల్లే
సిరిమల్లెల వాగల్లే… ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా… ఇది శాశ్వతమనుకోనా
నువ్వుంటే దిగులంటూ రాదే… నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు… కూడ పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే… నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా… ఎంతో ఇష్టాలే
Edo Priyaragam Song Lyrics In English
Edho Priyaragam Vintunnaa… Chirunavvullo
Premaa Aa Sandhadi Needhenaa…
Edho Navanaatyam Choosthunnaa… Sirimuvvallo
Premaa Aa Savvadi Needhenaa…
Ittaage Kalakaalam… Choodaalanukuntunnaa
Itupaina Ee Swapnam… Kariginchaku Emainaa
Premaa Oo Premaa… Chirakaalam Naavente
Nuvvunte Nijamegaa Swapnam… Nuvvunte Prathi Maata Sathyam
Nuvvunte Manasanthaa… Edho Theeyani Sangeetham
Nuvvunte Prathi Adugu Andham… Nuvvunte Prathi Kshanamu Swargam
Nuvvunte Ika Jeevithamanthaa… Edho Santhosham
Oo… Paata Paadadhaa Mounam… Purivippi Aadadhaa Praanam
Adavinaina Poodhota Cheyyadhaa… Prema Baatalo Payanam
Dhaari Chupadhaa Shoonyam… Arachetha Vaaladhaa Swargam
Elladhaati Paravallu Thokkadhaa… Velluvaina Aanandham
Premaa Nee Saavaasam… Naa Shwaasaku Sangeetham
Premaa Nee Saannithyam… Naa Oohala Saamraajyam
Premaa Oo Premaa… Gundello Kalakaalam
Nuvvunte Prathi Aasha Sontham… Nuvvunte Chirugaale Gandham
Nuvvunte Endainaa Kaadhaa… Challani Saayanthram
Nuvvunte Prathimaata Vedham… Nuvvunte Prathi Paluku Raagam
Nuvvunte Chirunavvulathone… Nindenu Ee Lokam
Oo… Unnachota Unnaanaa… Aakaashamandhukunnaanaa
Cheliyaloni Ee Kottha Sambaram… Naaku Rekka Thodigenaa
Munigi Theluthunnaanaa… Ee Muchhataina Muripaana
Aameloni Aanandhasaagaram… Nannu Munchu Samayaana
Hariville Nannalle… Ee Rangulu Neevalle
Sirimallela Vaagalle… Ee Vennela Neevalle
Premaa Oo Premaa… Idhi Shaashwathamanukonaa
Nuvvunte Dhigulantu Raadhe… Nuvvunte Velugantu Podhe
Nuvvunte Mari Maatalu… Kooda Paataipothaaye
Nuvvunte Edhurantu Ledhe… Nuvvunte Alupantu Raadhe
Nuvvunte Ye Kashtaalainaa… Entho Ishtaale